నివర్ తుపాన్ దాటికి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజా డిమాండ్ చేశారు. తెదేపా శ్రేణులతో కలిసి ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఇంకా గుర్తించడం లేదని.. వారిని వెంటనే గుర్తించి నష్టపరిహారం అందజేయాలని అన్నారు. నష్టపరిహారాన్ని కౌలు రైతులకు సైతం వర్తించేలా చేసి.. వారికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరానికి రూ.30 వేలు నష్ట పరిహారం చెల్లించాలని కోరిన విధంగానే .. ఇప్పుడు తాము కూడా అంతే మొత్తాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
'అప్పట్లో జగన్ డిమాండ్ చేసిన మొత్తాన్నే ఇప్పుడు అడుగుతున్నాం' - పంట నష్టపరిహారం
నివర్ తుపాన్ దాటికి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజా డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఇంకా గుర్తించడం లేదని.. వారిని వెంటనే గుర్తించి నష్టపరిహారం అందజేయాలని ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ వరుపుల రాజా