డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ వైఖరిపై తెదేపా నిరసన - tdp leaders protest p.gannavaram village
విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో వ్యవహరిస్తుందని తూర్పుగోదావరి జిల్లా తెదేపా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు పి. గన్నవరంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
![డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ వైఖరిపై తెదేపా నిరసన tdp protest at east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7236667-365-7236667-1589716120203.jpg)
డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ వైఖరిపై తెదేపా నిరసన
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్, అతని కుటుంబం పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని నినాదాలు చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అంబేడ్కర్ విగ్రహానికి సమర్పించారు. తెదేపా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం, మండల తెదేపా ఆధ్యక్షుడు పడాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.