రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ తెదేపా చేస్తున్న రిలే దీక్షల్లో భాగంగా.. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పట్టణ తెదేపా అద్యక్షులు ఉంగరాల రాంబాబుతో కలసి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లాక్ డౌన్ కాలంలో ప్రతి కుటుంబానికి నెలకు కనీసం 5 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి బొత్స హామీ ఇచ్చిన విధంగా మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరవాలన్నారు. ఆపద సమయంలో అండగా నిలిచే చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. ముఖ్యంగా అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య, పోలీస్, పారిశుద్ధ్యం, పాత్రికేయ సిబ్బందికి కరోనా రక్షణ పరికరాలు ఇవ్వాలని కోరారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.
'ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు' - ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండపేటలో తెదేపా దీక్ష
కరోనాతో సహజీవనం చేయాలన్న ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని.. తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు.
!['ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు' tdp protest against government at mandapet in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6993981-836-6993981-1588179834680.jpg)
మండపేటలో తెదేపా నేతల దీక్ష