రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తం చేశారు. వైద్యులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైద్యులను సస్పెండ్ చేయడమనేది క్రూరమైన చర్యని దుయ్యబట్టారు. ఒక పక్క రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంటే సరైన సౌకర్యాలు చేపట్టడంలో, పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చి ఈసీని తొలగించడం సరైంది కాదన్నారు. చేతకాని ప్రభుత్వం రాజ్యమేలుతుందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
'వైద్యులకి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం' - డాక్డర్లు సస్పెండ్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తం చేశారు. చేతకాని ప్రభుత్వం రాజ్యమేలుతుందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం
వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం
ఇదీ చూడండి:'మాస్కులు అడిగితే సస్పెండ్ చేయడమేంటి?'