రాష్ట్రంలో దొంగలు పడి దోచేస్తున్నారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సామాన్యులకు దొరకకుండా ఇసుకంతా ఎక్కడికి వెళ్తోందని బుచ్చయ్య చౌదరి నిలదీశారు. రెండు యూనిట్ల ఇసుక రూ.2,600 దొరికేదని ఇప్పుడు రూ.20 వేలు పెట్టాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ లైన్ అని మళ్లీ వెంటనే మూసివేయడం ఏమిటని నిలదీశారు. ఇంట్లో మరమ్మతులకూ కాసింత ఇసుక దొరకని పరిస్థితి ఉందని గోరంట్ల ఆక్షేపించారు.
సామాన్యులకు దొరక్కుండా ఇసుక ఎక్కడికి వెళ్తుంది..? - ఏపీలో ఇసుక కొరత
రాష్ట్రంలో ఇసుక కొరతపై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. సామాన్యులకు దొరకకుండా రాష్ట్రంలో ఇసుకంతా ఎక్కడికి వెళ్తుందని నిలదీశారు.
ఇసుక కొరతపై బుచ్చయ్య చౌదరి