తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సుమారు నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. అక్కడ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఎనిమిదిన్నర ఎకరాలను సేకరించారు. వర్షాలు పడుతున్న ప్రతిసారి ఈ స్థలాలు ముంపునకు గురవుతుండటంతో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల రాజా, ఆ పార్టీ నేతలు నీటిలో నడుచుకుంటూ వెళ్లి ఇళ్ల స్థలాలను పరిశీలించారు. పేదలకు కేటాయించిన స్థలాల్లో స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకుని ఉండగలరా అని వరుపుల రాజా ప్రశ్నించారు.
పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో భారీగా వర్షపు నీరు - ఏలేశ్వరం మండలంలో తెదేపా నేతల పర్యటన
తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షం పడిన ప్రతిసారి ముంపునకు గురవుతుండటంతో ఆ ప్రాంతాన్ని తెదేపా నాయకులు పరిశీలించారు.
నీటిలో వెళ్తున్న తెదేపా నేతలు