కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతోన్న అత్యాచార బాధితురాలిని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, నగరమేయర్ సుంకరపావని పరామర్శించారు. 'దిశ' సెంటర్‌లో ఉన్న యువతిని చూడటానికి వెళ్తే మొదట నిరాకరించారని.... తర్వాత ముగ్గురినే పంపించారని తెలిపారు. బాధిత యువతితో మాట్లాడనీయలేదని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరగడానికే తాము వచ్చామన్నారు. 'దిశ' సెంటర్‌లో ఇప్పటివరకూ 69 కేసులు నమోదయ్యాయని చెప్పారని.... వారిలో ఎంతమందికి న్యాయం జరిగిందని అడిగితే సిబ్బంది సమాదానం చెప్పలేదని తెలిపారు. బాధితురాలికి తెదేపా అండగా ఉంటుందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన తెలుగు మహిళా అధ్యక్షురాలు - girl rape latest news
కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, నగరమేయర్ సుంకరపావని పరామర్శించారు. బాధితురాలికి తెదేపా అండగా ఉంటుందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన తెలుగు మహిళ అధ్యక్షురాలు