మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ... తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. దేవిచౌక్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
'తెదేపా నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది' - news on tdp leaders protest in eastgodavari
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గోకవరంలో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. తమపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
!['తెదేపా నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది' tdp leaders protested in gokavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7595160-433-7595160-1592016407656.jpg)
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న తెదేపా నాయకులు