ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులా రహదారి... నిరసనగా వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే వేగుళ్ల - తూర్పు గోదావరి జిల్లాలో తెెదేపా నిరసన వార్తలు

తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం వద్ద తెదేపా నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. వర్షపు నీటితో బురదమయమైన ద్వారపూడి - మండపేట రహదారిపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే దుయ్యబట్టారు.

tdp protest
తెదేపా నిరసన

By

Published : Jul 14, 2021, 5:11 PM IST

వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే వేగుళ్ల

తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. వర్షపు నీటితో బురదమయమైన ద్వారపూడి - మండపేట రహదారిపై నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితమే రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు నిధులు మంజూరు కాగా.. ఇప్పటికీ టెండర్లు ఖరారు కాకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థ పనితీరుకు నిదర్శనమన్నారు. తక్షణమే రహదారిని నిర్మించాలని.. లేనిపక్షంలో తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వాన నీరు చేరి రహదారులు చెరువులను తలపిస్తున్నాయన్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. అనంతరం ఎమ్మెల్యే సొంత నిధులతో జేసీబీ ద్వారా వర్షం నీరు వెళ్లిపోయేలా రోడ్డుకు ఇరువైపులా తాత్కాలిక ఏర్పాట్లు చేయించారు.

ABOUT THE AUTHOR

...view details