విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే తగ్గించాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో దీక్ష చేశారు.
రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధినేత చంద్రబాబు పిలుపు మేరకు దీక్ష చేశామన్నారు.