రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా... తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలందరూ హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని తెదేపా ఎస్సీ సెల్ నాయకుడు కాశీనవీన్‌కుమార్ పిలుపునిచ్చారు.
'వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయి' - gokavaram news updates
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గోకవరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళన