పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ... తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు నిరసనదీక్ష చేపట్టారు. ప్రత్తిపాడులో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో తెదేపా నాయకులు దీక్ష కొనసాగించారు. కొత్త శ్లాబు విధానం రద్దు చేసి... పాత విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీల పరిధిలోనూ.. నిరసనలు చేపట్టనున్నట్టు తెదేపా నేత వరుపుల రాజా పేర్కొన్నారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తెదేపా శ్రేణుల నిరసన - current bill updates in east godavari dst'
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు నిరసన చేశారు. కొత్త శ్లాబు విధానం రద్దు చేసి... పాత విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు.
tdp leaders protest in east godavari dst about increasing of power bill charges