రాజమహేంద్రవరంలో తెదేపా నేత ఆదిరెడ్డి అప్పారావు కార్యకర్తలతో కలిసి తన నివాసంలోనే నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రానికి నిన్న చీకటి దినంగా అభివర్ణిస్తూ... నల్ల జెండాలను చేతపట్టారు. జగన్ నిర్ణయాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి, కేసీఆర్కు ప్రయోజనకరంగా ఉన్నాయని ఆదిరెడ్డి వాసు అన్నారు.
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన తెదేపా అధినేతను నిండు సభలో వైకాపా నేతలు అవమానపరిచారని తెదేపా నేత కృష్ణ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి ఆ హక్కును కాలరాస్తోందని మండిపడ్డారు.