ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ కేసులు ఎత్తివేయాలి: తేదేపా నేతల డిమాండ్ - రంపచోడవరంలో తెదేపా నేతల నిరసన వార్తలు

రంపచోడవరంలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల అదుపులో ఉన్న తమ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp leaders protest
అక్రమ కేసులు ఎత్తివేయాలి తేదేపా నేతలు ర్యాలీ

By

Published : Jun 14, 2020, 3:37 PM IST

రాష్ట్రంలో తెదేపా నాయకులపై పెడుతున్న కేసులు ఎత్తివేయాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. రంపచోడవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

వైకాపా తీరుకు రాబోవు రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అడబాల బాపిరాజు, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, మాజీ సర్పంచ్ నిరంజినీ దేవి, నాయకులు సూర్యనారాయణ రాజు, పాము అర్జున్​తో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details