ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తంగా మారిన తెదేపా నేతల నిరసన - ఉద్రిక్తంగా మారిన తెదేపా నేతల నిరసన తాజా వార్తలు

మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెదేపా చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కమిషనర్ రామ్మోహన్​కు వినతిపత్రం సమర్పించేందుకు ముందే అనుమతి తీసుకున్న తెదేపా నాయకులు.. కార్యాలయానికి చేరుకునే సమయానికి ఆయన అక్కడ లేకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా నేతలకు మధ్య తోపులాట జరిగింది.

Tdp leaders protest
తెదేపా నేతల నిరసన

By

Published : Dec 14, 2020, 3:08 PM IST

తెదేపా నేతల నిరసన

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో తెదేపా చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెంచిన ఆస్తి పన్ను రద్దు చేయాలి, సురక్షిత తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెదేపా నిరసన ర్యాలీ చేపట్టింది. తెదేపా కార్యాలయం నుంచి పురపాలక సంఘం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ కమిషనర్ రామ్మోహన్​కు వినతిపత్రం సమర్పించేందుకు ముందే అనుమతి తీసుకున్నారు. అయితే తాము వచ్చే సమయానికి కమిషనర్ వెళ్లి పోయారంటూ తెదేపా నాయకులు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

తెదేపా నాయకులను పోలీసులు అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, తెదేపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ బైఠాయించి నిరసన కొనసాగించారు. పోలీసులు వర్మను అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలిస్తుండగా.. వాహనానికి తెదేపా శ్రేణులు అడ్డుపడి ప్రతిఘటించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇవీ చూడండి...

యానాంలో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి మల్లాడి

ABOUT THE AUTHOR

...view details