'మద్యం ధరలు పెంచి సామాన్యుల పొట్ట కొడుతున్నారు' - ఏపీ మద్యం ధరల తాజా న్యూస్
మద్యం ధరలు 75 శాతం పెంచి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల పొట్ట కొడుతుందని అమలాపురం మాజీఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు విమర్శించారు. తెదేపా నాయకులతో కలిసి ఆయన అమలాపురం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
అమలాపురం మజీ ఎమ్మెల్యే ప్రెస్మీట్
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచి సామాన్యుల పొట్ట కొడుతుందని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తెదేపా మాజీఎమ్మెల్యే అయితాబత్తుల ఆనంద రావు విమర్శించారు. మద్యం ధరలు 75 శాతం పెంచడం వల్ల సామాన్యులు విపరీతంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు.