ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజల తరఫున పోరాటానికి తెదేపా ఎప్పుడూ ముందుంటుంది' - jyotula naveen latest news

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తెదేపా నేత జ్యోతుల నవీన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతూనే వాయిదాలు వేయడం ఏంటన్నారు.

tdp leaders press meet
తెదేపా నేతల మీడియా సమావేశం

By

Published : Nov 5, 2020, 3:20 PM IST

రాష్ట్ర అభివృద్ధికి తెదేపా అడ్డుపడుతోందంటూ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను వైకాపా ఆపాలని జ్యోతుల నవీన్ హితవు పలికారు. ఇళ్ల స్థలాల పంపిణీలో వైకాపా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

ఈ విషయంపై ప్రజల తరుఫున పోరాడటానికి తెదేపా ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సామాన్యుల ఇబ్బందులపై పోరాడుతుంటే అధికార దుర్వినియోగం చేస్తూ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details