ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP leaders met Nara Bhuvaneshwari నారా భువనేశ్వరీ, బ్రహ్మణీతో భేటీ అయిన సీనియర్ టీడీపీ నేతలు.. వైసీపీ నేతలకు జైళ్ళు సరిపోవు - రాజమహేంద్రం వార్తలు

TDP leaders met Nara Bhuvaneshwari: రాజమహేంద్రంలో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్దతు తెలిపేందుకు నేతలందరు తరలి వస్తుండటంతో.. జైలు ప్రాంతం బిజిబిజీగా మారుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు పరిటాల సునీత, ధూళిపాళ్ల నరేంద్ర మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తదితరులు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని.. ఆయన త్వరలోనే బయటకు వస్తారని ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 5:06 PM IST

Updated : Sep 23, 2023, 6:18 PM IST

TDP leaders met Nara Bhuvaneshwari: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు నేటి నుంచి 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో సీఐడీ బృందం చంద్రబాబు నాయుడిని విచారిస్తోంది. ఇప్పటికే... చంద్రబాబు అరెస్ట్​కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ నేతలే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు సైతం చంద్రబాబు అరెస్ట్​ను ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ మెుదలు.. భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ, రామకృష్ణలతో పాటుగా పలువురు కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజమహేంద్రవరంలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించేందుకు రాజమహేంద్రవరం జైలుకు వస్తున్న పలు పార్టీల నేతలు.. చంద్రబాబు కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. తాజాగా పలువురు టీడీపీ నేతలు భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి పరామర్శించారు.

తాజాగా రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, బ్రాహ్మణినిపరిటాల సునీత, ధూళిపాళ్ల నరేంద్ర మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ కలిశారు. తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్​పై టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పరిటాల సునీత పేర్కొన్నారు. ఎలాంటి తప్పు చేయని చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోని చంద్రబాబు మచ్చలేని నాయకుడిలా భయటకు వస్తారని తెలిపారు. అరెస్ట్​కు వ్యతిరేకంగా... పట్టణాలు, గ్రామాల్లో సైతం చంద్రబాబుకు మద్ధతు వస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబుు బస్సు యాత్ర, లోకేశ్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో మద్దతు వస్తుందనే... ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెతికి అందినకాడికి దోచుకుంటున్నారని పరిటాల సునీత ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైసీపీ అక్రమాలపై కేసులు పెడితే... రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని పరిటాల సునీత ఎద్దేవా చేశారు.


Chandrababu Expressed his Anguish Before Judge: "ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేశారు.. జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు"

చంద్రబాబుపై కావాలనే కేసులు పెడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 11 కేసుల్లో నింధితుడైన వ్యక్తి... సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న వక్తి చెబితే... అధికారులు తమ నేతపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో న్యాయం గెలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేవాళ్ల మీద అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. శాసన సభలో మంత్రులు అసత్యాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఐఐటీ, నిట్... లాంటి అనేక సంస్థలతో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలను ఉంచకుండా... అసత్యాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.


Nara Lokesh Reacted on CM Jagan Bail: "జగన్​మోహన్​ రెడ్డికి​ బెయిల్​ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు"

రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే భవానిచంద్రబాబు కుటుంబాన్ని కలిశారు.. ఆయన ఫ్యామిలీ చాలా ధైర్యంగా ఉందని తెలిపారు. చంద్రబాబుకు వచ్చే ఆధరణ చూసి ఓర్వలేని పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ చేసినా... కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్​పై తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా భయటికి వస్తారని పేర్కొన్నారు.

Former Minister Bhuma Akhila Priya Hunger Strike Broken by Police: భూమా అఖిల ప్రియ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం..

Last Updated : Sep 23, 2023, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details