ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎంపీ హర్షకుమార్​కు తెదేపా పరామర్శ - మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు న్యూస్

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్‌ను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. రెండు సార్లు ఎంపీగా ప్రజలకు సేవ చేసిన ఎస్సీ నాయకుడు హర్షకుమార్‌ను... అక్రమ కేసులతో ప్రభుత్వం వేధిస్తోందని తెదేపా నేత చినరాజప్ప ఆరోపించారు.

tdp leaders met ex mp harshakumar
tdp leaders met ex mp harshakumar

By

Published : Dec 19, 2019, 9:13 PM IST

మాజీ ఎంపీ హర్షకుమార్​ను పరామర్శించిన తెదేపా నేతలు

మాజీ ఎంపీ హర్షకుమార్​ను అరెస్టు చేయడంపై.. తెదేపా నేతలు మండిపడ్డారు. చింతమనేనిని ఇలానే అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా నేత చినరాజప్ప ఆగ్రహించారు. హర్షకుమార్‌ హైకోర్టులో స్టే తెచ్చుకున్నా.. అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు. రాజధాని అంశంలో రాష్ట్ర భవిష్యత్​ దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చినరాజప్ప విమర్శించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతులను, పెట్టుబడులు పెట్టేవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెదేపా నాయకులు హర్షకుమార్‌ను పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details