తెదేపా నాయకులను విమర్శించే స్థాయి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌కు లేదని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలేశ్వరంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైలా బోస్ అధ్యక్షతన తెలుగుదేశం నేతలు సమావేశం నిర్వహించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా జ్యోతుల నెహ్రూ... సమర్ధవంతమైన నాయకుడని పైలా బోస్ అభిప్రాయ పడ్డారు.
'తెదేపా నేతలను విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు' - తూర్పుగోదావరి జిల్లాలో సమావేశం
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో తెదేపా నాయకులు సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులను విమర్శించే స్థాయి ప్రత్తిపాడు ఎమ్మెల్యేకు లేదని మండిపడ్డారు.
ఏలేశ్వరంలో తెదేపా నేతల సమావేశం