వైకాపా విధ్వంసాలపై కలెక్టర్‌కు తేదేపా నాయకుల వినతి - tdp leaders latest news east godavari district
రాష్ట్రంలో విధ్వంసాల ప్రభుత్వానికి ఏడాది పూర్తయిందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. తెదేపా నాయకులను లోబర్చుకుని పార్టీని నిర్వీర్యం చేయాలన్న దురాలోచన ప్రభుత్వంలో కన్పిస్తోందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం దుశ్చర్యలను ప్రతిఘటిస్తూ అన్ని జిల్లాల్లోని ఎమ్మార్వోలు, ఆర్డీఓలు, కలెకర్లకు వినతి పత్రాలు అందించాలని తెదేపా నిర్ణయించినట్లు ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి కలిసి ఆయన తూర్పుగోదావరి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో విధ్వంసాల ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయిందని నెహ్రూ విమర్శించారు. ఇసుక సరఫరాలో విఫలమై... భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొట్టారని, సొంత సంస్థలు తయారుచేసిన మద్యంతో ప్రజారోగ్యం దెబ్బతీస్తున్నారని... విమర్శించారు. తెదేపా నాయకులను లోబర్చుకుని పార్టీని నిర్వీర్యం చేయాలన్న దురాలోచన ప్రభుత్వంలో కన్పిస్తోందని ఆయన విమర్శించారు. అచ్చెన్నాయుడు, జేసీల వ్యవహారంలో అదే జరిగిందన్నారు. మాజీ మంత్రి శిద్ద రాఘవరావుకు 800 కోట్ల వ్యవహారంపై నోటీసులు ఇచ్చి పార్టీలో చేరగానే మిన్నకుండిపోయారని జ్యోతుల విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పేదలకు ఇళ్లస్థలాల వ్యవహారంలో భూసేకరణ ప్రక్రియలో నాయకులకు, మంత్రులకు 1600 కోట్లు ముడుపులు అందాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ వైకాపా రాక్షస పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి: డిప్యూటీ తహసీల్దార్‌కు తెదేపా నేతల వినతి
TAGGED:
east godavari latest news