రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పేట్రేగిపోతున్నాయని తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. తరచూ ఘటనలు జరుగుతున్నా.. ఇంతవరకూ ఒక్క నిందితుడిని అరెస్టు చేయలేదని... రాజమహేంద్రవరంలో ఆ పార్టీ నేతలు జవహర్, బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ తెదేపా బృందం ఏఎస్పీకి వినతిపత్రం అందించారు. గతంలో ఇదే విషయమై ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించినా.. ఆమె నుంచి అనుమతి రాలేదన్నారు.
'విగ్రహం ధ్వంసం చేసినవారిని తక్షణమే అరెస్టు చేయాలి'
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలంటూ తెలుగుదేశం బృందం ఏఎస్పీకి వినతిపత్రం అందించారు.
రాజమహేంద్రవరంలో తెదేపా నేతల ఆందోళన