రాష్ట్రంలో వైకాపా అరాచకాలను అరికట్టాలని తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండల తెదేపా అధ్యక్షుడు మువ్వా శ్రీను స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావుకి వినతిపత్రం అందజేశారు. వైకాపా అధికారంలోకి రాగానే అరాచకాలు, మాఫియా, భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం మాఫియా పెరిగి పోయాయిని విమర్శించారు. అధికార పక్షం నాయకులే ఈ మాఫియాకు కొమ్ముకాసి నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ నాయకులను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.
డిప్యూటీ తహసీల్దార్‌కు తెదేపా నేతల వినతి - deputy mro taja news in east godavari dst
వైకాపా ప్రభుత్వ అరాచకాలను ఆపాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండల తెదేపా అధ్యక్షుడు మువ్వా శ్రీను స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమదందాలు ఊపందుకున్నాయని ఆయన ఆరోపించారు.
tdp leaders gave letter to deputy mro in east godavari dst about ycp ruling in state