ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Fire On YSRCP Govt: వైకాపా పనైపోయింది.. రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో లేదు: యనమల - యనమల తాజా వార్తలు

TDP Leaders Fire On YSRCP Govt: ప్రతిపక్షాలను, మీడియాను సీఎం జగన్‌ అణిచివేస్తున్నారన్నారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని.. ఇంకా ఎన్ని రోజులో రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు.

రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు
రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు

By

Published : Jan 3, 2022, 6:13 PM IST

రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు

TDP Leaders Fire On YSRCP Govt: రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇంకా ఎన్ని రోజులో రాష్ట్రాన్ని నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర అప్పు రూ.7 లక్షల కోట్లు దాటుతుందని, భారత్‌లో అట్టడుగు స్థానానికి రాష్ట్రం చేరుకుందన్నారు. సొంత ఆస్తులు పెంచుకోవటమే పనిగా పెట్టుకున్నారని, ప్రతిపక్షాలను, మీడియాను జగన్‌ అణిచివేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి..
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెదేపా సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయటం దారుణమన్నారు. ఈఘటనలో నిందితులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు.

విధ్వంసకర పాలన కొనసాగుతోంది..
రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం దాడులు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇలా అయితే ప్రాజెక్ట్‌ ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదీ చదవండి :

CBN: ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీకి లేఖ

ABOUT THE AUTHOR

...view details