ప్రజల ప్రాణాల కన్నా మద్యం అమ్మడానికే వైకాపా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని... కాకినాడ నగర మాజీఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. మద్యం దుకాణాలు మూయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ... తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ప్రతినిధులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు.
ఇలాంటి సమయంలో మద్యం అమ్మకాలా..? - తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా నేతలు
మద్యం దుకాణాలు మూయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ... తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు.
మద్యం షాపులు మూసివేయాలని తెదేపా నేతల డిమాండ్