ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది'

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబ సభ్యులను స్థానిక నాయకులతో కలిసి జవహర్ పరామర్శించారు.

By

Published : Nov 24, 2020, 6:56 PM IST

tdp leaders condolence to family suicide in Rajahmundry
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎండమావులుగా మారాయని తెదేపా రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్ విమర్శించారు. దిశ చట్టం, దిశ పోలీస్టేషన్లు తమ కర్యవ్యాన్ని నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాయని.. ఈ క్రమంలోనే నేరస్థులు తేలిగ్గా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో తల్లి పిల్లలతో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భవానీ, తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసుతో కలిసి జవహర్ పరామర్శించారు.

మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎంతో మంది అబలలు బలైపోయారని జవహర్ ఆరోపించారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంవల్లే తల్లి, పిల్లలతో సహా శివపావని ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. నలుగురి ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్త నాగేంద్ర కుమార్​ను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే భవానీ డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details