ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి ఆ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి' - తెదేపా తూర్పుగోదావరి నాయకుల నిరసన

సర్దార్ గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తెదేపా తూర్పు గోదావరి నాయకులు ఖండించారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

tdp leaders condemn minister sidiri appalaraju comments
తెదేపా నేతల నిరసన

By

Published : Dec 26, 2020, 5:30 PM IST

సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామంటూ మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో తెదేపా నేతలు ఖండించారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

గౌతు లచ్చన్నను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి.. తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details