కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్‌కు చిత్తశుద్ధి లేదని మాజీమంత్రి చినరాజప్ప విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో తెదేపా నేతలు చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించారు. కాపులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత చంద్రబాబుదేనని చినరాజప్ప స్పష్టం చేశారు.
'కాపుల రిజర్వేషన్‌పై జగన్‌కు చిత్తశుద్ధి లేదు' - TDP Leaders Coments on Kapu Reservations
వైకాపా సర్కారు అధికారంలోకి వస్తే.. కాపులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన జగన్... ఉన్న లబ్ధిదారులను కుదించారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
తెదేపా నేతల మీడియా సమావేశం
కాపుల పిల్లలకు ఉన్నత, విదేశీవిద్య అందించిన ఘనత తెదేపాదేనని నిమ్మల రామానాయుడు అన్నారు. కాపు కార్పొరేషన్‌ను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని నిమ్మల దుయ్యబట్టారు.
ఇవీ చదవండి:గొప్ప రాజకీయవేత్త, బహుభాషాకోవిదుడు.. పీవీ: సీఎం జగన్