తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం న్యాయవాది సుభాష్ చంద్రబోస్‌ను.. పోలీసులు తక్షణమే కోర్టులో హజరుపరచాలని తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. తెదేపా నేతల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొన్నారు. తమ నాయకుడు పైలా సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తూ అర్థరాత్రి.. పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.
'లాయర్ బోస్‌ని తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టాలి' - lawyer chandrabose latest news
న్యాయవాది బోస్‌ని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ.. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
!['లాయర్ బోస్‌ని తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టాలి' agitation for lawyer bose](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8245593-338-8245593-1596199364691.jpg)
తెదేపా నేతల నిరసన
బోస్‌ను అరెస్టు చేసి 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కోర్టులో హాజరుపరచకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోస్‌ను అరెస్టు చేసిన ఇద్దరు ఎస్సైలు, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే బోస్‌ను కోర్టులో హాజరు పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఏలేశ్వరం ఎమ్మార్వో కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:కొత్తపేట నియోజకవర్గంలో మరో 6 కరోనా కేసులు