ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ చేపట్టాలి: వరుపుల రాజా - తెదేపా నేత వరుపుల రాజా తాజా వార్తలు

పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పేరిట.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్.. కోట్ల రూపాయలు అవినీతికి పాలడ్డారని.. తెదేపా నేత వరుపుల రాజా ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో పట్టా భూములు తక్కువ ధరకే కొని.. ఎక్కవ మొత్తంలో బిల్లులు వసూలు చేశారని అన్నారు.

tdp leader varupula raja fires on ycp mla parvatha purnachandraprasad over housing for poor
ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ చేపట్టాలి: వరుపుల రాజా

By

Published : Jul 4, 2021, 5:17 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా.. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పేరిట కోట్ల రూపాయలు అవినీతికి పాలడ్డారని తెదేపా నేత వరుపుల రాజా ఆరోపించారు. నియోజకవర్గంలో పట్టా భూములు తక్కువ ధరకే కొని.. ఎక్కవ మొత్తంలో బిల్లులు వసూలు చేశారన్నారు. లోతట్టు ప్రాంతంలో భూములు, ముంపునకు గురయ్యేవి, రహదారి మార్గాలు లేనివి, కొండ ప్రాంతాల్లో భూములు పేదలకి ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని ఆరోపణలు చేశారు.

ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు.. ఊరికి దూరంగా ఉన్నాయని.. ప్రజలు నివాస ఆమోద యోగ్యం కాని ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని విమర్శించారు. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ చేపట్టాలని.. లేదంటే హైకోర్టు ఆశ్రయిస్తామని రాజా హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details