అరెస్టులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే - vanthala rajeshwari latest news
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జ్ వంతల రాజేశ్వరి ధ్వజమెత్తారు.
![అరెస్టులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే tdp leader vanthala rajeshwari fire on ycp governament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7603981-279-7603981-1592055224292.jpg)
సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరీ
తెదేపా సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, మాజీమంత్రులు నిమ్మకాయల రాజప్పపై అక్రమంగా కేసులు పెడుతున్నారని రంపచోడవరం మాజీఎమ్మెల్యే వంతల రాజేశ్వరీ మండిపడ్డారు. శనివారం క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆమె... ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న తమనేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వైకాపాలోకి చేరడంలేదనే సాకుతో ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారని అమె ఆరోపించారు.