TDP leader house arrest: తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అనపర్తి మండలం రామవరంలో తెదేపా నేత రామకృష్ణారెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. బలభద్రపురంలో గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభోత్సవాన్ని తెదేపా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. 400 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు తెదేపా, జనసేన నేతలను గృహ నిర్బంధం చేశారు. గతంలో కేపీఆర్ పేరుతో ఉన్న సంస్థను వైకాపా అడ్డుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే కేపీఆర్ సంస్థను రద్దు చేస్తామన్న జగన్... తాజాగా అదిత్య బిర్లా సంస్థ గ్రాసిమ్ పరిశ్రమగా ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం జగన్ పర్యటన దృష్ట్యా.. తెదేపా నేతల గృహ నిర్బంధం - తూర్పుగోదావరి జిల్లా లేటెస్ట్ అప్డేట్
Jagan Tour: తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తెదేపా నేత రామకృష్ణారెడ్డితో పాటు కార్యకర్తలు, జనసేన నేతలను గృహనిర్బంధం చేశారు. బలభద్రపురంలో గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభోత్సవం వద్ద 400 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
" ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా కేపీఆర్ ఇండస్ట్రీస్‌గా ఉన్న పరిశ్రమ అనుమతులు రద్దు చేస్తామని జగన్ అన్నారు. అక్కడ 500 మందిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను రద్దు చేయిస్తాని చెప్పారు. ఫ్యాక్టరీని తీసుకెళ్లి బంగాళఖాతంలో కలిపేస్తానని... గొప్పలు చెప్పిన జగన్ మోసం రెడ్డి... ఇవాళ ఏ ముఖం పెట్టుకుని పరిశ్రమ ప్రారంభోత్సవానికి వస్తున్నారో చెప్పాలి. ఎన్నికల ముందు పబ్బం గడుపుకోవడం కోసం ప్రజలకు మోసపు హామీలిచ్చి... ఇప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కై ఈ మూడేళ్లు వాళ్లకు పూర్తిగా ప్రయోజనాలు చేకూర్చి... నిర్మాణం పూర్తి కావడానికి కారకులై... ప్రారంభోత్సవం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా..?" - తెదేపా నేత రామకృష్ణారెడ్డి
ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లాలో నేడు జగన్ పర్యటన