ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​ అవినీతి అక్రమాలు బయటపెడతా' - వరుపుల రాజా తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైకాపా శాసనసభ్యులు పర్వత ప్రసాద్​ అవినీతి అక్రమాలను త్వరలోనే బయటపెడతానని తెదేపా నియోజకవర్గ బాధ్యులు వరుపుల రాజా వ్యాఖ్యానించారు. చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలపై ఆరోపణలు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​ అవినీతి అక్రమాలు బయటపెడతా
ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​ అవినీతి అక్రమాలు బయటపెడతా

By

Published : Sep 24, 2020, 10:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైకాపా శాసనసభ్యులు పర్వత ప్రసాద్​పై తెదేపా నియోజకవర్గ బాధ్యులు వరుపుల రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పర్యటించిన తెదేపా నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. సీనియర్ నాయకులను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలని హితవు పలికారు. గత 16 నెలలు కాలంలో 20 రకాలుగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. పర్వత ప్రసాద్ అవినీతి అక్రమాలను త్వరలోనే బయటపెడతానని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details