TDP Leader Nallamilli Ramakrishna Reddy Fire on CM Jagan :వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే నీటి తీరువా వసూళ్లను ఉపసంహరించుకోవాలని, యూరియా ధరలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Increased Urea Prices :సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక సందర్భాలలో రుజువు చేసుకుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం లేని పరిస్థితి ఏర్పడినప్పటికీ రైతులు అనేక కష్టాలకు ఓర్చి ఏదో ఒక విధంగా సాగు చేసుకుంటున్నారని అన్నారు. అయితే రైతులకు యూరియా అవసరం పడే పరిస్థితికి వచ్చేప్పటికి యూరియా ధరలు పెరగడం దారుణ పరిస్థితి అని తెలిపారు. రిటైలర్లు 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచి యూరియా అమ్ముతున్నారన్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందన్నాని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Water Tax: భారంగా నీటి తీరువా.. ఆందోళనలో రైతులు...
Water Tax for Agriculture Lands in AP :కృష్ణా, గోదావరి డెల్టాలలో సాగునీరుకి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగు సంవత్సరాలుగా యూరియా ధరలు కానీ, ఇతర ఎరువుల ధరలు కానీ విపరీతంగా పెంచి రైతులను దోచుకున్న వైసీపీ ప్రభుత్వం మరో దోపిడికి సిద్ధమైందని తెలిపారు. గోదావరి డెల్టాలో సమృద్ధిగా సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం.. నీటి తీరువా వసూళ్లు వేగవంతం చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకర పరిణామమని తెలిపారు.