ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలి: జ్యోతుల నెహ్రు - తెదేపా నేత జ్యోతుల నెహ్రు వార్తలు

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి... పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు.

tdp leader jyothula nehru visited crop damaged areas at east godavari and demands government to give compensation to farmers
రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలి: జ్యోతుల నెహ్రు

By

Published : Nov 29, 2020, 9:23 PM IST

వరుస ప్రకృతి విపత్తులతో రైతులకు అపార నష్టం కలిగిందని తెదేపా నేత జ్యోతుల నెహ్రు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ పరిధిలోని సూదికొండ, జగన్నాధపురం కృష్ణుని పాలెం గ్రామాల్లో... తుపాను కారణంగా నష్టపోయన పంటనలు ఆయన పరిశీలించారు. రైతులు ఎకరాకు రూ.40 వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలను ఆదుకుని ఎకరాకు రూ.20 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నవరత్నాలకు ఏ విధంగా నిధులు సమకూరుస్తున్నారో... అదేవిధంగా రైతులకు కూడా నిధులు సమకూర్చాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details