ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్​డౌన్ ద్వారానే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట'

లాక్​డౌన్ విధించటం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. వైరస్ అదుపులోకి వచ్చే వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 50 శాతం తగ్గించాలని.. జిల్లాలో తిరిగి లాక్​డౌన్ విధించాలని డిమాండ్ చేశారు.

'లాక్​డౌన్ ద్వారానే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట'
'లాక్​డౌన్ ద్వారానే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట'

By

Published : Jun 26, 2020, 10:31 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున లాక్​డౌన్ విధించాలని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. లాక్​డౌన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి సమయంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం హేయమైన చర్యని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించటంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకు చమురు ధరలు 50 శాతం తగ్గించాలని.. జిల్లాలో తిరిగి లాక్​డౌన్ విధించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details