ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్రమ మైనింగ్​పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' - chinese clay mining at jaggampet

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో అక్రమ మైనింగ్​ జరుగుతోందని తెేదాపా నేత తెదేపా ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp leader jyothula nehru comments on illigal mining at east godavari ramavaram
tdp leader jyothula nehru comments on illigal mining at east godavari ramavaram

By

Published : Mar 22, 2021, 3:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలోని దళితులకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్​ జరుగుతోందని తెదేపా ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. సుమారు పది కోట్ల రూపాయలు విలువ చేసే చైనా క్లే ను ఇప్పటివరకు కొల్లగొట్టారని ఆరోపించారు. మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

అక్రమ మైనింగ్ పై ప్రశ్నిస్తే.. అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతున్నారని జ్యోతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రామవరంలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై ప్రభుత్వం సత్వరమే స్పందించి... కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details