లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేత, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని తన ఇంటి వద్ద 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో జ్యోతుల నెహ్రూ పాల్గొనాల్సి ఉండగా.. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన నిరసనలో పాల్గొనకున్నా.. సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో వాలంటీర్ల పనితీరు సరిగా లేదన్నారు. అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైద్య సిబ్బంది, పోలీసులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని నెహ్రూ డిమాండ్ చేశారు. చంద్రబాబును విమర్శించే స్థాయి విజయసాయిరెడ్డిది కాదని అన్నారు.
కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం విఫలం: జ్యోతుల నెహ్రూ - tdp leader jyothula protest for corona help to poor people
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ సరిగా పని చేయడం లేదన్న ఆయన.. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం విఫలం: జ్యోతుల నెహ్రూ