ఉప రాష్ట్రపతి వెంకయ్యను.. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు, తూర్పుగోదావరి జిల్లా తెదేపా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త హరీశ్ మాథుర్ దిల్లీలో కలిశారు. కోనసీమ అభివృద్ధికి సహకరించాలని.. ఆ ప్రాంతంలో విద్యా, వైద్య విధానాలు బలోపేతం చేయాలని కోరారు.
దివంగత బాలయోగితో ఉన్న అనుబంధాన్ని ఆయన కుమారుడు హరీశ్ మాథుర్తో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య పంచుకున్నారు. వీలు చూసుకుని కోనసీమ ప్రాంతంలో పర్యటించాలని హరీశ్ మాథుర్ చేసిన అభ్యర్థనకు ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు.