ఇళ్ల స్థలాలు, లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాట్లాడుతూ.. శ్మశాన వాటికలు, నదీ తీరాలు, ఊరికి దూరంగా ఉన్న నివాసయోగ్యం కాని భూములు సేకరిస్తున్నారని విమర్శించారు.
'ఇళ్లస్థలాల ఎంపికలో పారదర్శకత లేదు' - ఇళ్ల స్థలాల పంపిణీపై తెదేపా నేత గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యలు
ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంచడంలో తమకు అభ్యంతరం లేదని.. అయితే అవి పేదలకు భరోసాగా ఉండాలని తెదేపా సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు.
!['ఇళ్లస్థలాల ఎంపికలో పారదర్శకత లేదు' tdp leader gollapalli surya rao on house sites](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7946047-973-7946047-1594216491294.jpg)
గొల్లపల్లి సూర్యారావు, తెదేపా నేత
4, 5 లక్షలు చేయని భూములను రూ.35 నుంచి 50 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 30 లక్షలమంది కాకుండా 3 కోట్ల మందికి స్థలాలు పంచినా తమకు అభ్యంతరం లేదని... అయితే అవి పేదలకు భరోసాగా ఉండాలని సూచించారు. లోపాలు ఎత్తిచూపే వారిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...
రైతు దినోత్సవం కాదు.. రైతు సొమ్ము దుబారా దినోత్సవం: దేవినేని