కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జీ యనమల కృష్ణుడు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇంటి వద్దే నిరసనకు ఉపక్రమించారు. పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని.. అన్న క్యాంటీన్లు తెరవాలని, బీమా అమలు చేయాలని, కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న వారికి రక్షణ సామగ్రి అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని తెదేపా నేత నిరాహార దీక్ష - tdp leader protest on the demand of helping poor people news
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు నిరాహార దీక్షలకు దిగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో తెదేపా ఇంఛార్జీ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
![ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని తెదేపా నేత నిరాహార దీక్ష ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని తెదేపా నేత నిరాహార దీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6863787-1010-6863787-1587361474725.jpg)
ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని తెదేపా నేత నిరాహార దీక్ష