వైకాపా పాలనలో స్మార్ట్ సిటీ కాకినాడ ముంపు నగరంగా మారిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వనమాడి కొండబాబు ఆరోపించారు. ఏలేరు వరద ఓ వైపు, సముద్ర జలాలు మరోవైపు కాకినాడ నగరాన్ని ముంచెత్తాయన్నారు. రక్షణ కవచంలా ఉన్న మడ అడవుల్ని నరికేయడం వల్లే వరద నీరు నగరంలోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు దుమ్ములపేట, సంజయ్ నగర్లో పర్యటించారు.
కాకినాడ నగరాన్ని ముంపు సిటీగా మార్చేశారు : తెదేపా - వరద ముంపులో కాకినాడ నగరం వార్తలు
వైకాపా ప్రభుత్వం స్మార్ట్ సిటీ కాకినాడను ముంపు ప్రాంతంగా మార్చిందని తెదేపా నేతలు విమర్శించారు. కాకినాడ దుమ్ములపేట, సంజయ్ నగర్లో పర్యటించిన ఆ పార్టీ నేతలు ప్రజలతో మాట్లాడారు. నగరానికి రక్షణ కవచంలా ఉన్న మడ అడవులను నరికివేయడం వల్ల వరద నీరు నగరంలోకి వచ్చిందన్నారు.
kakinada tdp
ముంపు బాధితులు తాము పడుతున్న ఇబ్బందుల్ని తెదేపా నాయకుల వద్ద ఏకరవు పెట్టారు. ఇళ్ల స్థలాల పేరిట మడ అడవుల్ని నరకి వేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ముంపు బాధితుల్ని ఆదుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: చినరాజప్ప