ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ విధానాల వల్లే కార్మికుల ఆత్మహత్యలు: చినరాజప్ప - ఏపీ ప్రభుత్వంపై మాజీ హోంమంత్రి ఆగ్రహం

ప్రభుత్వం ఏర్పడి 5నెలలు గడుస్తున్నా ఇంకా ఇసుక సమస్య పరిష్కరించలేకపోతుందని తెలుగుదేశం నేత చినరాజప్ప విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

By

Published : Nov 11, 2019, 10:18 AM IST

ఇసుక కొరతపై ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. తూర్పుగోదావరిజిల్లా రాజానగరం మండలంలోని దివాన్ చెరువులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఇసుక కొరత కారణంగా అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి స్పందిచటంలేదని ఆరోపించారు. గోదావరిలోని చాలా రేవుల్లో ఇసుక లభ్యమవుతున్నా రాష్ట్ర ప్రజలకు అందడం లేదని... ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. పేదలు ఇల్లు కట్టుకోవటానికి ఇసుక లేక నానా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details