ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే.. ఫలితం ఇదే' - తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలు

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన తెదేపా గ్రామ కమిటీ ఎన్నికలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.

tdp grama kamitee election
tdp grama kamitee election

By

Published : Dec 23, 2019, 3:24 PM IST

తేదేపా గ్రామ కమిటీల ఎన్నికలు

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీలను ఎంపిక చేశారు. ఒక అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు మాసాల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మద్యం కంపెనీల నుంచి వైకాపా ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఆ బ్రాండ్ లకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలో సారా ఏరులై పారుతోందని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలకు సారా వ్యాపారం ఉపాధిలా మారిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details