TDP financial assistance: ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్(అనంతబాబు) చేతుల్లో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సహాయాన్ని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉన్న మృతుని భార్య, తల్లిదండ్రులకు అందించారు. అనంతకుముందు మాజీ జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, వంతల రాజేశ్వరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జవహర్, పలువురు తెదేపా నేతలు స్థానిక రైతు భవన్లో సమావేశమయ్యారు. అనంతరం అక్కడనుంచి వెళ్లి బ్రౌన్పేట శివారు కందకం ప్రాంతంలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నగదు రూపంలో అందజేశారు. అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత ఇచ్చినట్లు చెప్పారు. మొదటి నుంచి సుబ్రమణ్యం హత్య కేసు విషయంలో తెలుగుదేశం పోరాడుతుందన్నారు.
TDP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెదేపా ఆర్థిక సాయం..రూ.5 లక్షలు అందజేత - డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెదేపా ఆర్థిక సాయం అందజేత
TDP financial assistance to subrahmanyam family: ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్(అనంతబాబు) చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని తెలుగుదేశం అందజేసింది. అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించినట్లు నేతలు తెలిపారు.
TDP give 5 lakhs to driver subrahmanyam family
ఎమ్మెల్సీ అనంతబాబు.. ఎస్సీ అట్రాసిటీ కేసుల నుంచి బయటపడేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని రాష్ట్ర తేదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజు ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అనంతబాబు... తాను కొండకాపు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తక్షణమే ఎమ్మెల్సీ పదవి రద్దు చేసి ఎస్సీ అట్రాసిటీ సెక్షన్ వర్తించే విధంగా అనంతబాబుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి:
TAGGED:
east godavari district news