విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో తెలుగుదేశం సీనియర్ నేత అశోక గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను... తెదేపా మాజీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. పేదలకు తరతరాలుగా సేవలు అందిస్తున్న అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి మంత్రి వెల్లంపల్లికి లేదని మాజీ ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు, బుచ్చిబాబు అన్నారు.
'అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి మంత్రి వెల్లంపల్లికి లేదు' - మంత్రి వెల్లంపల్లిపై తెదేపా నేతల ఆగ్రహం న్యూస్
అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను తెదేపా మాజీ ఎమ్మెల్యేలు ఖండించారు. చంద్రబాబు రామతీర్థానికి వెళ్లే సమయంలో... ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లి గొడవలు సృష్టించారని మండిపడ్డారు.

మంత్రి వెల్లంపల్లిపై మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం
ప్రతిపక్షనేత వెళ్లే సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థానికి వెళ్లి గొడవలు సృష్టించారని ధ్వజమెత్తారు. మాన్సాస్ ట్రస్ట్ భూములు, దేవాలయ ఆస్తులు కాజేసేందుకు అధికారపక్ష నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:కత్తిని నమ్ముకున్న వాడు దానికే బలైపోతాడు: నారా లోకేశ్