ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా బావతో మా కుటుంబానికి సంబంధాలు లేవు.. నా అరెస్టు అక్రమం: నల్లమిల్లి - కాకినాడ సబ్‌ జైలు నుంచి జీజీహెచ్‌కు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తరలింపు

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకే.. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను అరెస్టు చేశారని అన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం నల్లమిల్లిని పోలీసులు కాకినాడ సబ్‌ జైలు నుంచి జీజీహెచ్‌కు తరలించారు.

tdp ex mla nallanilli ramakrishna reddy was shifted to ggh from kakinada sub jail
మా బావ సత్తిరాజుతో నాకు సంబంధాలు లేవు.. అక్రమంగా నన్ను అరెస్టు చేశారు: నల్లమిల్లి

By

Published : Mar 13, 2021, 12:19 PM IST

Updated : Mar 13, 2021, 1:01 PM IST

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని.. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు కాకినాడ సబ్‌ జైలు నుంచి జీజీహెచ్‌కు తరలించారు.

'నాకు వారితో సంబంధాలు లేవు'

పోలీసులు తనపై కక్ష కట్టారని.. తన బావ హత్య కేసులో అన్యాయంగా తనను ఇరికించారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చనిపోయిన తన బావ సత్తిరాజురెడ్డితో..2005 నుంచే వారికి ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. తన బావ వ్యసనాలకు గురై కుటుంబాన్ని పట్టించుకోలేదని.. గుండెపోటుతో మరణిస్తే ఫోరెన్సిక్ నివేదికలో తప్పుడు వివరాలు చేర్చారని ఆరోపించారు. సత్తిరాజురెడ్డి మృతదేహాన్ని తన తండ్రి, భార్య, కుమార్తె ఎవ్వరు అడిగినా ఇవ్వలేదని తెలిపారు.

నా పోరాటం ఆగదు

అనపర్తి నియోజకవర్గంలో గ్రావెల్, నాటు సారా, పేకాట క్లబ్​లు తదితర అక్రమాలు వెలుగులోకి తెచ్చినందుకే ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి.. తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు చేశారు. పోలీసులు కూడా అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో నాయకులు ఎలా ఉన్నారన్న దానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని అన్నారు. తనను ఎన్ని విధాలుగా వేధించినా, అక్రమ అరెస్ట్ లు చేసినా భయపడను, పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మా బావతో నాకు సంబంధాలు లేవు.. నా అరెస్టు అక్రమం: నల్లమిల్లి

ఇదీ చదవండి:

'అక్రమ అరెస్ట్‌లతో భయపెట్టడం జగన్ నైజం'

Last Updated : Mar 13, 2021, 1:01 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details