పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో వైకాపా నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తెదేపా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్థలాల మెరక పేరుతో వైకాపా మట్టిని దోపిడి చేస్తుందని ఆయన ఆరోపించారు. భూముల కొనుగోలు ధరలను రెండు రెట్లు పెంచేసి లబ్ది పొందుతున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన లబ్దిదారులకు ఏ గ్రామాల్లో భూములు కేటాయిస్తారో స్పష్టం చేయాలని కోరారు.
'పేదల ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి' - రావులపాలెం తాజా వార్తలు
పేదల ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కొత్తపేట మాజీఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తేదీలను మారుస్తూ లబ్ధిదారులను అయోమయానికి గురి చేస్తోందని విమర్శించారు.
!['పేదల ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి' tdp ex mla bandaru satyananda rao asking about clarity in giving houses to poor people in ravulapalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7927828-539-7927828-1594129542008.jpg)
కొత్తపేట మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు