ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండపేటలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం - east godavari district elections

ప్రజా సంక్షేమాన్ని కోరి జనరల్ ఫండ్​లో ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించే హక్కు కౌన్సిలర్లకు ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

tdp election campaigning in mandapeta east godavari district
మండపేటలో జోరుగా తెదేపా మున్సిపల్ ఎన్నికల ప్రచారం

By

Published : Feb 27, 2021, 4:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట ఆరో వార్డులో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి కాశిన కాశీవిశ్వనాథంను గెలిపించాలని కోరుతూ... ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఛైర్ పర్సన్ అభ్యర్థి గడి సత్యవతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనరల్ ఫండ్​ను ప్రజా అవసరాలకు వినియోగించే హక్కు కౌన్సిలర్​కు ఉంటుందని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. కౌన్సిలర్ అభ్యర్థి కాశీవిశ్వనాథంను గెలిపిస్తే గొల్లపుంత కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details