వైకాపా ప్రభుత్వం ఏడాది పాలన అనేక తప్పులతో సాగిందని.. తూర్పుగోదావరి జిల్లా తెదేపా అధ్యక్షుడు నామన రాంబాబు విమర్శించారు. రాజోలు నియోజకవర్గం మగటపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు. అన్ని రకాలుగా విఫలమయ్యారని అన్నారు.
'ఏడాది పాలనలో అన్ని రకాలుగా విఫలం' - వైకాపా పాలనపై తెదేపా నేత నామన రాంబాబు విమర్శల వార్తలు
వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రకాలుగా విఫలమైందని.. తెదేపా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు అన్నారు. తెదేపాపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన విమర్శించారు.
నామన రాంబాబు,. తెదేపా నేత
ఇసుక సామాన్యులకు అందకుండా... వైకాపా నేతలే దోచుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తెదేపాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, కార్యకర్తలపై దాడులు చేయడం వంటివి చేస్తోందన్నారు.
ఇవీ చదవండి.. విధ్వంసానికి ఒక్క ఛాన్స్.. జగన్ ఏడాది పాలన పై పుస్తకం
TAGGED:
namana rambabu latest news